నిహారికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ..!

మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మరి కొన్ని రోజుల్లో నిహారికా, చైతన్యల వివాహం జరగనున్న విషయం తెలిసిందే.. ఈనెల 9న రాత్రి 7.15 గంటలకు వీరి పెళ్లి జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనున్న ఈ పెళ్లి వేడుకల కోసం కుటుంబంలోని వారంతా కలిశారు. 

ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ కు మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ తమ బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, అల్లు స్నేహారెడ్డి, అల్లు బాబీ వంటి పలువురు ప్రముఖులు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Leave a Comment