పిరమిడ్ ప్రాంతంలో ఫొటో షూట్.. ఫొటో గ్రాఫర్, మోడల్ అరెస్ట్..!

పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించి ఆర్కియాలజీ జోన్ లో ప్రైవేట్ ఫొటో షూట్ చేసినందుకు ఫొటో గ్రాఫర్, మోడల్ ను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేశారు. మోడల్-డాన్సర్ సల్మా అల్ షిమీ ఈజిప్టియన్ల పూర్వ కాలం నాటి వస్త్రధారణను తలపించేలా దుస్తులు ధరించి ఫొటోలు దిగారు. 4700 వందల ఏళ్లనాటి చరిత్ర గల జోసర్ పిరమిడ్ ప్రాంగణంలో ఈ ఫొటో షూట్ జరిగింది. 

ఈ ఫొటోలను సల్మా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఫొటో గ్రాఫర్ ను, సల్మాను అరెస్టు చేశారు. ఈజిప్టియన్ల సంప్రదాయాలను అగౌరవపరిచినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారంటూ సోషల్ మీడియా ఇన్ల్ఫూయర్స్ పై ఈజిప్టు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది. అయితే ఆర్కియాలజీ నోజ్ లో ఫొటోలు తీసుకోవడంపై నిజంగానే నిషేధం ఉందా? లేదా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

Leave a Comment