కోళ్ల నుంచి గబ్బిలాలకు కొత్త వైరస్..

ఇటీవల కాలంలో అంతుచిక్కని వైరస్లు ప్రబలుతున్నాయి. దీని ప్రభావంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కేరళలో నెలకొన్నాయి. అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేరళలోని కొజిక్కెడె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కొజొక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. టైప్-ఎ ఇన్ ఫ్లూయాంజకు సంబంధించిన హెచ్5, హెచ్7 వైరస్ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్ కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తున్న 1200 వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేధించారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు. 

Leave a Comment