అయ్యప్ప భక్తుడి సాహసం.. ఒంటికాలుపై 750 కి.మీ. నడక..!

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఓ దివ్యాంగుడు సాహసం చేశాడు. ఏకంగా 750 కిలోమీటర్లు నడిచి అయప్పస్వామిని దర్శించుకున్నాడు. నెల్లూరుకు చెందిన అకరపాక సురేష్ అనే దివ్యాంగుడు గతేడాది సెప్టెంబర్ 20వ తేదీ నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమ్మవారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాడు. 

పవిత్రమైన ఇరుముడిని తలపై పెట్టుకుని, ఎవరి సహకారం లేకుండా ఒంటి కాలితో ఊతకర్రను సాయంతో దాదాపు 105 రోజులు పాదయాత్ర చేశాడు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల వాతావరణ ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో నడక కొనసాగించాడు. ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి రెండురోజుల క్రితం యాత్రను పూర్తి చేసుకున్నాడు. 

ప్రతిరోజూ నాలుగు గంటలకు బయటుదేరి ఎండ పెరిగే సరికి ఏదో ఒక ఆలయంలో సేదదీరేవాడు. బిక్ష చేసిన అనంతరం తిరిగి బయలుదేరేవాడు. రాత్రి సమయంలో కూడా దగ్గరలోని ఆలయాల్లో బస చేసేవాడు. సురేష్ ఇలా కాలినడకన అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఇది రెండోసారి.. శబరిమల ఆలయ అధికారులు సురేష్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసరమైన సాయం చేసి దర్శనం పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.  

 

Leave a Comment