హమ్మయ్య ఎట్టకేలకు.. ఒక్కటైన నయనతార, విఘ్నేష్ జంట..!

నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గురువారం తెల్లవారుజామున మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో  నయనతార, విఘ్నేష్ పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. 

వీరి పెళ్లి వేడకుకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా పెళ్లికి కొద్ది క్షణాల ముందు విఘ్నేశ్ నయనతారపై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తను వధువుగా ముస్తాబై వివాహ వేదికపై నడుచుకుంటూ వస్తుంటే.. చూడాలని ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్ చేశాడు.  

  

 

Leave a Comment