ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ముస్లింలు వాడొద్దు : ఆస్ట్రేలియా మత పెద్ద

ఆక్స్ ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ను ముస్లింలు తీసుకోవద్దని ఆస్ట్రేలియాకు చెందిన ఓ ముస్లిం మత పెద్ద వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ‘హరామ్’ కాబట్టి ముస్లింలు ఎవరూ ఈ వ్యాక్సిన్ ను తీసుకోవద్దని చెప్పాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను తమ జనాభాకు ఉచితంగా ఉందించేందుకు ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద సుఫ్యాన్ ఖలీఫా ఓ వీడియోను విడుదల చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ను  అభివృద్ధి చేయడానికి కంపెనీ అనుసరిస్తున్న పద్ధతి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వీడియోలో తెలిపారు. నిషేధించబడిన పద్ధతుల్లో దీనిని తయారు చేశారని చెప్పారు. 

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను 1970లలో గర్భస్రావం చేయబడిన శిశువు యొక్క పిండ కణాలను  అభివృద్ధి చేసి ఈ టీకాలో ఉపయోగించారని ఖలీఫా తన యూట్యూబ్ ఛానెలో విడుదల చేసిన వీడియోలో చెప్పారు. పలువురు ముస్లింల శరీరాలపైనా వ్యాక్సిన్ ను ప్రయోగించారని, ఇది చాలా సిగ్గు చేటని, దీనిని ఖండించాలని వ్యాఖ్యానించారు. మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా కొంతమంది మతపెద్దలు వ్యాక్సిన్ కు మద్దతు పలకడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయనతో పాటు పలువురు క్యాథలిక్ క్రైస్తవ మత పెద్దలు కూడా ఈ వ్యాక్సిన్ తయారీ విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Leave a Comment