ప్రాణాల మీదకు తెచ్చిన ఫ్రీ ఫైర్ గేమ్.. నరాలు చిట్లీ.. తల్లిదండ్రులనే మరిచిన విద్యార్థి..!

ఆన్ లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ అంటే పిల్లలకు ఎంత క్రేజో తెలిసిందే.. అలా ఆన్ గేమ్స్ కు అలవాటు పడి ఎంతో మంది ప్రాణాల మీదకు తచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్రీఫైర్ ఆటకు బానిసైన ఓ విద్యార్థి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నరాలు చిట్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చివరికి తన తల్లిదండ్రులను సైతం గుర్తుపట్టలేకపోతున్నాడు. 

వివరాల మేరకు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బరాయుడు(13) 8వ తరగతి చవుదుతున్నాడు. గత కొంతకాలంగా సెల్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఇలా దాదాపు మూడు నెలల నుంచి ఎవరు పిలుస్తున్నా పట్టించుకోకుండా గేమ్ ఆడేవాడు. రెండు రోజులు క్రితం ఇంటి వద్ద స్పృహ తప్పి పడిపోగా తల్లిదండ్రులు కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. బాలుడు తల్లిదండ్రులను సైతం గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ ఫోన్ గేమ్ కి బానిసై నరాలు చిట్లీ అపస్మారక స్థితి ఉన్నాడని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.     

Leave a Comment