‘మిర్చి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్..!

కొరటాల శివ, ప్రభాస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. ప్రస్తుతం కొరటాల శివ ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవితో సందేశాత్తమక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆయన చరణ్ కి కథ వినిపించడం, చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పై కొరటాల టీమ్ కసరత్తు ప్రారంభించిందని తెలిసంది.

ఈ ప్రాజెక్టు తరువాత ప్రభాస్ తో కొరటాల సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కొరటాల- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మిర్చి మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ కావడం, ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. నాగ్ అశ్విన్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లనుంది కొరటాలతోనే.

Leave a Comment