గాజువాకలో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు..!

విశాఖపట్నం జిల్లా గాజువాకలో వింత ఘటన చోటుచేసుకుంది. గాజువాక 66 వార్డ్ అజీమాబాధ్ లో వేప చెట్టు తోరలు నుంచి పాలు వస్తున్నాయి. దీంతో చుట్టూ పక్కల ఉన్న ప్రజలు ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇది నిజంగా దేవుని స్వరూపం అని, వేప చెట్టు అంటే నూకాలమ్మ తల్లి స్వరూపిణిగా భావిస్తామని స్థానికులు అంటున్నారు.  అటువంటి వేప చెట్టు నుంచి పాలు రావడం ఆ తల్లి మహిమ అని చెబుతున్నారు. 

వేప చెట్టుకు ఒక దగ్గర నుంచి కాకుండా అనేక చోట్ల నుంచి పాలు రావడం నిజంగా ఈ ప్రాంతం అదృష్టం అని స్థానిక మహిళలు అన్నారు. వేప చెట్టు తోరలని ఎన్ని సార్లు మట్టి తో కప్పినా మళ్ళీ పాలు వస్తున్నాయి అని అన్నారు. గాజువాక మండలంలో అగనంపూడిలో కూడా గతంలో వేప చెట్టు కి పాలు రావడం చూశామన్నారు.  అక్కడ గుడి కూడా ఏర్పాటు చేసి నూకల తల్లిగా పూజలు చేస్తున్నారన్నారు. 

Leave a Comment