14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టే ధర డబులు..!

దాదాపు 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టె ధర డబుల్ కానుంది. ప్రస్తుతం రూ.1 నుంచి రూ.2 కు పెరగనుంది. డిసెంబర్ 1 నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ధరతో పాటు పుల్లల సంఖ్య కూడా పెంచుతామని చిన్న అగ్గిపెట్టెల తయారీదారుల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు ఒక అగ్గిపెట్టెలో 36 పుల్లలు ఇస్తుండగా.. ఇక నుంచి 50 పుల్లలు ఇస్తామని పేర్కొంది. 

తూత్తుకుడి జిల్లా, కోవిల్ పట్టి తెన్ కాశి జిల్లా శంకరం కోయిల్, విరుదునగర్ జిల్లా శివకాశి, గుడియాత్తంలో సుమారు రెండు వేలకు పైగా అగ్గిపెట్టె కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో సుమారు 5 లక్షల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవల క్లోరైడ్, అట్ట, మైనం, పేపర్ తదితర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో అగ్గెపెట్టె ధరలను పెంచాలని ఉత్పత్తిదారుల సంఘం కోరింది. 

Leave a Comment