షాకింగ్: చపాతీలు తిని కంటి చూపు కోల్పోయిన బాలుడు..!

ఏంటీ ఆశ్యర్యంగా ఉందా? అవును ఇది నిజమే.. ఓ 12 ఏళ్ల కుర్రాడికి చపాతీలు అంటే చాలా ఇష్టం.. రోజుకు 40 చపాతీలు తినేవాడు.. దీంతో ఆ బాలుడు కంటి చూపు కోల్పోయాడు. వైద్యులు ఆ బాలుడికి సర్జరీ చేసి చూపు ప్రసాదించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ శివ్ పూరి జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కుర్రాడు సందీప్ కి కంటి చూపు మందగించడం ప్రారంభమైంది. అలా మందిగిస్తూ ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. దీంతో ఆ బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు సందీప్ శరీరంలోని అవయవాలు అన్ని పనిచేయడం లేదు. కేవలం ఊపిరి మాత్రమే తీసుకోగలుగుతున్నాడు. 

సందీప్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ బాలుడి రిపోర్టులు చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే సందీప్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. దీంతో ఆశ్యర్యపోయిన వైద్యులు ఆ బాలుడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి వైద్యులకు తెలిపాడు. 

ఇంత పెద్ద మొత్తంలో చపాతీలు తినడం వల్ల సందీప్ లో షుగర్ లెవల్స్ పెరిగిపోయింది. అంతేకాక మెదడులో చీము చేరింది. దాని వల్ల అతడు కంటి చూపు కోల్పోయాడు. శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయడం మానేశాయి. వైద్యులు సందీప్ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. 

సందీప్ లో షుగర్ లెవల్స్ తగ్గించడం కోసం ప్రతి రోజు 6 యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చారు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చింది. కంటి వైద్యులు సందీప్ ను పరీక్షించి అతడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నట్లు చెప్పారు. తర్వాత సందీప్ కు కంటి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు సందీప్ చూడగలుగుతున్నాడు. ప్రస్తుతం సందీప్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.  

Leave a Comment