మే 7 వరకు లాక్ డౌన్

తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్ణయం

ఇంటి అద్దె వసూలు చేస్తే కఠిన చర్యలు

తెలంగాణలో మే 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చాలా కఠినమైన నిర్ణయం తీసకున్నామన్నారు. అన్ని సర్వేల్లో లాక్ డౌన్ పొడిగించాలని వచ్చిందని తెలిపారు. తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రయాణికులు 100 శాతం కోలుకున్నారన్నారు. 

మే 5న మరోసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలు బయటకు రావద్దని స్పష్టం చేశారు. మే 7 వరకు విమాన ప్రయాణికులు తెలంగాణకు రావద్దని సూచించారు. దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదని చెప్పారు. 

పిజ్జా, జుమాటో సేవలు నిలిపివేత..

పిజ్జా, జుమాటో సేవలను సీఎం కేసీఆర్ నిలిపివేశారు. బయట నుంచి ఎవరూ కూడా తినుబండారాలను తెప్పించు కోవద్దన్నారు. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ఎవరూ కూడా ప్రార్థనలు, పూజలు చేయడానికి వీలులేదన్నారు. ఢిల్లీలో పిజ్జా హట్ ద్వారా అరవై తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.

ఉద్యోగులకు వేతనాల్లో 50 శాతం, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తామన్నారు. వైద్యులు,పోలీసులకు నెలవారి జీవితంలో 10 శాతం గ్రాస్ అదనంగా ఇస్తామన్నారు. అన్ని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 100 శాతం వేతనాలు అందిస్తామన్నారు. 

అద్దె తీసుకుంటే కఠిన చర్యలు

 మార్చి, ఏప్రిల్, మే మాసాలకు యజమానులు అద్దెను తీసుకోవద్దని, యజమానులు ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు కట్టమని బలవంతం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తి గతంగా 12 కిలోల బియ్యం, రూ.1500 కూడా అందజేయాలని ఆదేశించారు. 

Leave a Comment