లాక్ డౌన్ విఫలం..నెక్ట్స్ ఎంటీ : రాహుల్ గాంధీ

దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ నియంత్రించించేందుకు కేంద్రం చేపడుతున్న ప్రణాళిక ఎంటని ప్రశ్నించారు. మంగళవారం ట్విట్టర్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. 

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చే దేశం ప్రపంచంలో కేవలం భారత దేశం మాత్రమే ఉందన్నారు. మార్చి 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించినప్పుడు 21 రోజుల్లో కరోనాపై విజయం సాధిస్తామని చెప్పారన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధించి 60 రోజులు దాటిందని, అయిన కేసుల సంఖ్య తగ్గడం లేదని, కరోనా వైరస్ ను నియంత్రించడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. 

దేశంలో కరోనా కేసులు తగ్గాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, నిజానికి కేసులు తగ్గడం లేదని చెప్పారు. ‘భారత దేశంలో లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంలో వ్యూహం ఏమిటి? వాధిని అరికట్టడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వలస కార్మికులను ఎలా ఆదుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎంఎస్ఎంఈలకు ఎలా మద్దతు ఇస్తారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.  

 

Leave a Comment