స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ 

అమరావతి :  రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్.రమేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిబంధనలను , మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

కలెక్టర్ల చర్యలు సంతృప్తికం..

 స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్వేచ్ఛగా, కచ్చితత్వంతో , పారదర్శకంగా నిర్వహించే దిశలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రమేష్ కుమార్ అన్నారు.  ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ముఖ్యంగా ఏడు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు 

ప్రత్యేక దృష్టి పెట్టండి..

ఓటర్ల జాబితా యొక్క సవీనీకరణ,ముద్రణ, బ్యాలెట్ బాక్స్ లు , ఆర్ ఓలు, ఏఆర్‌ఓలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈవోలు, ఏఈవోలు పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల పరిధి లోనూ నియమించడం, ఎన్నికల సిబ్బంది,మైక్రో అబ్జర్వర్ లను  గుర్తించడం, ఎ న్నికల సామగ్రి అయిన ఫార్మ్స్, కవర్లు , హ్యాండ్ బుక్స్, ఇతర మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ , ఎంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. 

కాలవ్యవధి తగ్గస్తాం..

 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ప్రక్రియలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రస్తుతం ఉన్న కాలవ్యవధి 27 రోజులను 20 రోజులకు తగ్గిస్తామన్నారు.  ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు యంసిసి అమల్లో ఉంటుంది. చట్టపరమైన ఇబ్బందులకు అవకాశం లేకుండా మార్గదర్శకాలను ఖచ్చితత్వంతో కూడి అమలు చేయాలని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. 

Leave a Comment