కర్నూలు జిల్లా రోళ్లపాడులో ఉన్న పక్షుల అభయారణ్యం అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి గ్రీన్ కో కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి గాను అటవీశాఖ, గ్రీన్ కో కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా గ్రీన్ కో కంపెనీ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏడాదికి రూ.కోటి చొప్పున పది సంవత్సరాల పాటు అటవీశాఖకు ఇచ్చి అంతరించిపోతున్న బట్ట మేక పిట్ట సంరక్షణకు, రోళ్లపాడు అభయారణ్యం సమగ్రాభివృద్ధికి దోహదపడేందుకు ఈ అవగాహన పత్రంలో పొందు పరిచారు. ఈ అవగాహన పత్రంలో అటవీశాఖ తరపున ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ అధికారి, గ్రీన్ కో వైస్ ప్రెసిడెంట్ సంతకాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అటవీదళాధిపతి ఎన్.ప్రతీప్ కుమార్, వన్యప్రాణ ముఖ్య సంరక్షకులు డి.నళినీ మోహన్ సమక్షంలో జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమంలో ముందుకు వచ్చిన గ్రీన్కో వారిని అభినందిస్తూ, ఇతర కంపెనీలు కూడా వన్యప్రాణి సంరక్షణకు తమ వంతు సహాయం చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆకాంక్షించారు.
You might also like