14 ఏళ్ల బాలుడితో లేడీ టీచర్ జంప్..!

విద్యార్థికి చదువు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ అతడికి ప్రేమ పాఠాలు వల్లించింది. అతడికి మాయమాటలు చెప్ప తనతో తీసుకుపోయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని పానిపట్ కు చెందిన దంపతులు 9వ తరగతి చదువుతున్న తన కుమారుడి(14)కి ట్యూషన్ చెప్పడానికి ఓ 20 ఏళ్ల యువతిని నియమించారు. 

ఆమె గత మూడు నెల నుంచి రోజూ వారి ఇంటికెళ్లి నాలుగు గంటల పాటు బాలుడికి ట్యూషన్ చెప్పేది. ఈక్రమంలో గత నెల 29న బాలుడు దెస్రాజ్ కాలనీలో ఉంటున్న ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లాడు. ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లిన బాలుడు రాత్రి అయినా ఇంటికీ రాలేదు. అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. 

దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లి కుమారుడి కోసం వాకాబు చేశారు. అయితే తమ కూతురు కూడా కనిపించడం లేదని యువతి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో ట్యూషన్ టీచర్ పై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ టీచర్ కు గతంలోనే పెళ్లి అయిందని, కొద్ది రోజులకే విడాకులు కూడా తీసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Leave a Comment