గడ్డం గీయించుకోవాలని ప్రధానికి రూ.100 పంపిన టీ అమ్మే వ్యక్తి..!

కరోనా లాక్ డౌన్ తో పేదల జీవితాలు దుర్బేధ్యంగా మారిపోయాయి. కొందరు తినడానికి తిండి కూడా దొరక్క అల్లాడుతున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తి లాక్ డౌన్ కష్టాలను ప్రధాని మోడీకి తెలియజేయాలనుకున్నాడు. లాక్ డౌన్ తో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య గురించి ప్రధాని మోడీకి లేఖ రాశాడు.. 

మహారాష్ట్రలోని బారామతికి చెందిన అనిల్ మోరే అనే వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రి ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నాడు. లాక్ డౌన్ పై తన అసంతృప్తిని ప్రధానికి తెలియజేయాలని ఓ లేఖ రాశాడు. ఆ లేఖతో పాటు గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100 పంపించాడు. 

ఆ లేఖలో ఏం రాశాడంటే.. ప్రధాని మోడీ గడ్డం బాగా పెంచుతున్నారని, ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపాధి అవకాశఆలు కల్పించే విధంగా ఉండాలని పేర్కొన్నాడు. దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్ వేయించడానికై ఉంటే మంచిదన్నారు. వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రయత్నాలు చేయాలన్నాడు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లాక్ డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై దృష్టి పెట్టాలని లేఖలో పేర్కొన్నాడు. 

ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవని చెప్పాడు. తాను దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు వంద రూపాయలు పంపుతున్నట్లు తెలిపాడు. దాంతో ఆయన గడ్డం గీయించుకోవాలని పేర్కొన్నాడు. అయితే ప్రధాని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదన్నాడు. కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకు ఇలా చేసినట్లు తెలిపాడు. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, లాక్ డౌన్ తో దెబ్బతిన్న కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సహాయం అందించాలని లేఖలో కోరాడు. 

Leave a Comment