ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. సౌతాఫ్రికా మహిళ రికార్డు..!

దక్షిణాఫ్రికాకు చెందిన తమారా సితోలే(37) అనే మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని సితోలే భర్త టెబోగో సోటెట్సీ తెలిపారు. తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులు అయిందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని చెప్పాడు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే కొద్ది రోజుల పాటు ఇంక్యూబెటర్ లో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నాడు. 

అయితే 10 మంది పిల్లలు పుడతారనే విషయం కాన్పుకు ముందు తెలియదని సితోలే చెప్పింది. డాక్టర్లు తీసిన స్కానింగ్ రిపోర్టులో మొదట ఆరుగురు పిల్లలు పుడతారని చెప్పారని, మళ్లీ కొన్ని రోజుల తర్వాత స్కానింగ్ చేస్తే 8 మంది పిల్లలు పుడతారని చెప్పారని పేర్కొంది. అయితే వైద్యుల రిపోర్టులను అధిగమించి ఆమె 10 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం.. సితోలే గతంలోనూ ఇద్దరు కవలలకు జన్మినచ్చారు. మొత్తంగా ఆమె సంతానం రెండు కాన్పుల్లోనే 12కు చేరింది. 

 

Leave a Comment