ప్రధాని ముందు మోకరిల్లి.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు..!

ఆయన పేరు స్వామి శివానంద.. 125 సంవత్సరాల వయస్సు ఉన్న యోగా గురువు.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మార్చి 21న జరిగిన పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో.. అవార్డు అందుకునే సమయంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముందు మోకరిల్లాలు.. ఇది అక్కడున్న వారితో పాటు దేశంలో అందరినీ కదిలించింది. 

ప్రధాని మోడీ ముందు మోకరిల్లగానే ఆయన కూర్చీలో నుంచి లేచి తలవంచి నమస్కరించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కూడా తన ముందు మోకరిల్లిన శివానందను పైకి లేపి అవార్డు అందించారు. ఇది చూసి దర్బార్ హాల్ లోని అతిథులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. పద్మశ్రీ అందుకున్న అతి పెద్ద వయస్కునిగా శివానంద నిలిచారు. 

 స్వామి శివానంద వారణాసికి చెందిన యోగా గురువు. 1896 ఆగస్టులో శివానంద జన్మించారు. చిన్న తనంలో గురు ఓంకారానంద గోస్వామి ఈయన బాగోగులు చూసుకున్నారు. శివానంద స్కూలుకు వెళ్లలేదు. అయినా యోగాలో మాత్రం ఓ స్థాయికి వెళ్లిపోయారు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన గంటల తరబడి యోగా సాధన చేస్తారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. సాత్విక భోజనం తీసుకుంటారు. ఆయనకు అన్ని సంవత్సరాలు వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం..  

 

 

Leave a Comment