స్కూల్ లో విద్యార్థినికి ముద్దు పెట్టిన హెచ్ఎం.. సస్పెండ్ చేసిన అధికారులు..!

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. తన ఛాంబర్ లో ఓ విద్యార్థినికి ముద్దు పెట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆ హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని హెచ్.డి.కోటే తాలుకాలోని ఓ ప్రైవేట్ పాఠశాల హెచ్ఎం ఆర్.ఎం.అనిల్ కుమార్ విద్యార్థిని తన ఛాంబర్ లోకి తీసుకెళ్లి ముద్దు పెడుతుండగా.. మిగిలిన విద్యార్థులు కిటికీలో నుంచి వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ హెడ్ మాస్టర్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. 

ఈ వీడియో ఉన్నతాధికారుల వరకు చేరడంతో హెచ్ఎంపై వారు చర్యలు తీసుకున్నారు. ఆ కీచక ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. 

Leave a Comment