తబ్లిఘీ జమాత్ పై ట్వీట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు షోకాజ్..

తబ్లిఘీ జమాత్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కర్ణాటక ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహ్సిన్ కు కర్ణాటక ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తబ్లిఘ్ సభ్యులను మొహ్సిన్ తన పోస్టులో ప్రశంసించారు. 

మోహ్సిన్ తన  పోస్టులో ఏమన్నారంటే ‘‘కరోనా వైరస్ నుంచి కోలుకున్న జమాత్ సభ్యులు తమ ప్లాస్మాను దానం చేస్తున్నారు. ఇది కరోనా వైరస్ చికిత్స కోసం ప్రయోగాత్మకంగా ఉపయోగపడుతుంది. కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటానికి సహకారం అందిస్తున్న ‘హీరోలు’ విస్మరించబడుతున్నారు’’ అని తెలిపారు. ‘‘300 మందికి పైగా తబ్లిఘీ హీరోలు దేశానికి సేవ చేయడానికి ప్లాస్మాను దానం చేస్తున్నారు. కానీ ఈ హీరోల మానవత్వం గురించి గోడీ మీడియా చూపించడం లేదు’’ అని మొహ్సీన్ ఏప్రిల్ 27న ట్వీట్ చేశారు. 

అయితే ఈ ట్వీట్ కు ప్రతికూలంగా మీడియాలో  కవరేజ్ వచ్చింది. దీంతో మొహ్సిన్ పై ఆల్ ఇండియా సర్వీస్ రూల్(1968) ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏప్రిల్ 30న కర్ణాటక ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఐదు రోజుల్లో ఈ ట్వీట్ పై వివరణ ఇవ్వాలని చెప్పింది.

ప్లాస్మా దానం వార్తలకు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. కరోనా వ్యాప్తికి కారణమైన వారిని ఇప్పుడు కరోనా యోధులుగా చెప్పుకుంటున్నారని చెప్పారు. 

 

Leave a Comment