అచ్చం సౌందర్యలాగే ఉంది కదూ..!

టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది సౌందర్య. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. టాలీవుడ్ అగ్రహీరోలందరితో సౌందర్య నటించి అలరించింది. ముఖ్యంగా వెంకటేష్, సౌందర్య జంట తెలుగు తెరపై సూపర్ హిట్ అయింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. మహానటి సావిత్ర తర్వాత నటనలో అంతటి పేరు తెచ్చుకుంది సౌందర్య.

కాగా 2004లో ఓ పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారానికి వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. సౌందర్య మరణించి ఇప్పటికీ 17 సంవత్సరాలు అవుతోంది. అయినా ఇప్పటికీ ఆమెను ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. అయితే సౌందర్య పోలికలతో ఓ అమ్మాయి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అచ్చం సౌందర్యలాగే కనిపిస్తోంది. ఈమె పేరు చిత్ర.. మలేషియాలో ఉంటుంది. అచ్చం సౌందర్య మాట్లాడినట్లు చేసిన వీడియోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. చిత్రను చూసిన వారు జూనియర్ సౌందర్య అని, సౌందర్య మళ్లీ పుట్టిందా అని కామెంట్లు చేస్తున్నారు.. 

 

View this post on Instagram

 

A post shared by Chitra❤ (@chitra_jii2)

Leave a Comment