‘ప్రేమ ఎప్పుడు చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’.. ఆకట్టుకుంటున్న ఉప్పెన ట్రైలర్..

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో, హీరోయిన్లుగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన.. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సినీ లవర్స్ కు కొత్త ఫీల్ అందించేందుకు వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 

 ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ప్రేమంటే.. ఓ లైలా మజ్నూలా.. దేవదాసు పార్వతిలా’ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. ఇక విలన్ పాత్రలో విజయ్ సేతుపతి తన విశ్వరూపం చూపించారు.

‘ ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని ఇళ్లలో తిరిగితే దాని విలువ తగ్గిపోదు.. అందుకే ప్రేమ ఎప్పుడు చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’ అని విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

 

Leave a Comment