గాడిద పాలతో సబ్బు తయారీ.. కోట్లు సంపాదిస్తున్నాడు..!

గాడిద పాలతో సబ్బు.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. ఈ ఒక్క ఐడియా ఓ యువకుడి జీవితాన్నే మార్చేసింది. మొదట్లో ఈ ఐడియా గురించి చెబితే అందరూ నవ్వుకున్నారు. గాడిద పాలతో సబ్బు ఏంటని స్నేహితులు, బంధువులు ఎగతాళి చేశారు. అయినా ఆ యువకుడు నిరుత్సాహ పడలేదు. తమ మీద తాను నమ్మకాన్ని కోల్పోలేదు. అనుకున్నట్లు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాది తిరిగే సరికి భారీగా లాభాలు గడిస్తున్నాడు. అతనే జోర్డాన్ కు చెందిన 32 ఏళ్ల యువకుడు ఎమాద్ అట్టియట్..

ఎమాద్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో పీజీ చేశాడు. ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా జాబ్ దొరకలేదు. ఉద్యోగం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. అయితే అతని తల్లి ఓ సలహా ఇచ్చింది. గాడిద పాలతో సబ్బు తయారు చేయాలని ఐడియా ఇచ్చింది. అంతే తల్లి చెప్పిన ఐడియాలో దానిపై గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ ఐడియా గురించి ఎవరికి చెప్పినా అందరూ నవ్వుకున్నారు.

ఎంతమంది విమర్శలు చేసినా ఎమాద్ వెనక్కి తగ్గలేదు. గాడిద పాలతో సబ్బు తయారీ బిజినెస్ ప్రారంభించాడు. ‘ఎమాద్ అటాన్ డాంకీ మిల్క్ సోప్స్’ అనే పేరుతో ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. అటాన్ అంటే ఆడగాడిద అని అర్థం.. అలా ఏడాది తిరిగే సరికి మంచి లాభాలు పొందుతున్నాడు. 

ఎమాద్ మడాబా అనే ప్రాంతంలో 12 గాడిదలను పెంచుతున్నారు. ఒక్కో గాడిద రెండు లీటర్ల పాలు ఇస్తుంది. ఈ పాలను చల్లార్చాక వాటిని జోర్డాన్ రాజధానిలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్ కు పంపిస్తారు. అక్కడ ఎమాద్ తల్లి ఆధ్వర్యంలో ఈ సబ్బులను తయారు చేస్తారు. ఈ గాడిద పాలకు నూనెలు, వనమూలికలు వేసి ఓ మిశ్రమాన్ని తయారు చేస్తారు. దాని ఓ మూసలో పోసి గడ్డకట్టేలా సబ్బులా తయారు చేస్తారు. ఒక లీటర్ గాడిద పాలతో 30 సబ్బులు తయారు అవుతాయి. 

గాడిద పాలు చర్మానికి మంచి అందం ఇస్తాయి. దీంతో జనాలు ఈ సబ్బుల కోసం ఎగబడుతున్నారు. ఎమాద్ కంపెనీలో ప్రస్తుతానికి 4500 సబ్బులను తయారు చేస్తున్నారు. ఈ సబ్బు ధర 11 డాలర్లు.. అంటే 807 రూపాయలు.. అదే 125 గ్రాముల సబ్బులను రూ.వెయ్యి పైగానే అమ్ముతున్నారు. చిన్నగా స్టార్ట్ అయిన వీరి వ్యాపారం ఇప్పుడు కోట్లకు దారి తీస్తోంది. కొత్త ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేస్తే కచ్చితంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చనడానికి వీరే ఉదాహరణ…

Leave a Comment