నిన్న బెయిల్..నేడు మళ్లీ అరెస్టు..!

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. తాడిపత్రి సీఐ దేవేంద్ర కుమార్ పై అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిద్దరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కూడా వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వివరించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ పై బయటకొచ్చిన 24 గంటల్లోనే వారిని మళ్లీ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, గురువారం కడప జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చారు. అక్కడ నుంచి కార్యకర్తలు, అభిమానులతో భారీ కారు ర్యాలీతో ఇంటికి బయలుదేరారు. కండీషన్ బెయిల్ లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి సంతకాలు చేశారు.  ఈ సందర్భంగా సీఐ దేవేందర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు. పబ్లిక్ గా సీఐని బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. జేసీ అరెస్టు సందర్భంగా తాడిపత్రిలో 144 సెక్షన్ అమలులో ఉంది. తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 

Leave a Comment