సోనూసూద్ నివాసాలపై ఐటీ దాడులు..! 

కరోనా లాక్ డౌన్ లో పలు సేవా కార్యక్రమాలు రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.. సొంత ఖర్చులతో ఎంతో మంది వలస కార్మికులు, పేద ప్రజలకు సాయం చేశారు. ఆయన సేవలను గుర్తించి ఢిల్లీ ప్రభుత్వం ఆయన్ను పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెంటార్ షిప్ ప్రొగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గానూ నియమించింది. దంతో సోసూసూద్ పై ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నుపడింది. 

సోనూసూద్ ఇళ్లపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ముంబైలోని ఆయన కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముంబై కార్యాలయంతో పాటు ఆయనకు చెందిన మరో ఆరు స్థలాల్లో కూడా ఏకకాలంలో తనిఖీ జరిగినట్లు తెలిసింది. ఆయనకు సంబంధించిన ఆదాయ వివరాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ ఐటీ దాడులు జరిగాయని సమాచారం.. 

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేపట్టిన ‘దేశ్ కా మెంటార్’ పథకానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈక్రమంలో ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే సోనూసూద్ మాత్రం వీటిపై స్పందించడానికి నిరాకరించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సోనూసూద్ మీటింగ్ జరిగిన కొన్ని రోజుల్లోనే ఐటీ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

Leave a Comment