చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు..ఆస్ట్రేలియాపై గెలిచి తొలిసారిగా సెమీస్ లో అడుగు..!

టోక్యో ఒలింపిక్స్ తో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన బలమైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బకొట్టింది. సమిష్టిగా రాణించడంతో గెలుపు భారత్ సొంతమైంది. 

భారత మహిళల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత తొలిసారి క్వార్టర్స్ ఫైనల్ కు చేరి అంచనాలను పెంచింది. ఆ అంచనాలను నిజం చేస్తూ సగర్వంగా సెమీస్ లో అడుగుపెట్టింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్ లో తొలిసారిగా సెమీస్ చేరింది. 

ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలిచింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్ కు తొలి పాయింట్ అందించింది. ఆ తర్వాత మ్యాచ్ హోరాహోరీగా సాగింది. బలమైన ఆస్ట్రేలియాను ఒక్క గోల్ కూడా చేయనీయకుండా భారత మహిళలు అడ్డుకున్నారు. ఇక గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 

 

Leave a Comment