భారత్ లో ముస్లింలు సురక్షితం : మంత్రి అబ్బాస్ నఖ్వీ

ముస్లింలకు భారతదేశం స్వర్గమని, వారి సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన హక్కులు ఇక్కడ సురక్షితమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC) భారత దేశంలో ఇస్లామోఫోబియా ఉందని చెప్పంది. 

ముస్లింల హక్కులను కాపాడటానికి మరియు దేశంలో ఇస్లామోఫోబియా సంఘటలను ఆపడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ప్రకటించింది.

భారతీయ మీడియా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, వారిని వివక్షకు గురిచేస్తోందని OIC యొక్క స్వతంత్ర శాశ్వత మానవ హక్కుల కమిషన్ ఒక ట్విట్ లో పేర్కొంది. 

అయితే OIC ప్రకటనకు నఖ్వీ ప్రతిస్పందించారు. భారతదేశంలో ముస్లింలు సురక్షితమని,  ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసే వారు తమ స్నేహితులు కాలేరని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. 

 

Leave a Comment