రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

నిద్రించే సమయంలో శరీరంపై నూలు పోగు లేకుండా పడుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఇది విదేశాల్లో ఎక్కువగా ఉన్నా.. మన భారతదేశంలో తక్కువగానే కనిపిస్తుంది. అయితే రాత్రి పూట బట్టలు లేకుండా నిద్రపోవడంపై స్లీప్ సైకాలజిస్ట్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.. 

రాత్రి పూట బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్ర యొక్క నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. బట్టలు లేకుండా నిద్ర పోయేటప్పుడు చెమట కారి ఒంటి మీద ఉండిపోయి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని, దీంతో నిద్ర యొక్క నాణ్యత పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడుతుందని బ్రెయిన్ కి సరైన రెస్ట్ దొరకదని, ఒత్తిడి, మానసిక సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి అని తెలియజేశారు. న్యూరాలజిస్ట్ మరియు స్లీప్ ఫిజిషియన్ రిపోర్ట్ ప్రకారం బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల మరింత వేడిగా అనిపిస్తుంది. బట్టలు వేసుకుని నిద్ర పోవడం మంచిదని సూచించారు. కాటన్ లాంటి నాచురల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవాలని, సమ్మర్ లో ఇవి వేసుకోవడం వల్ల అంత వేడిగా అనిపించకుండా బాడీని చల్లగా ఉంచుతుందని అన్నారు. 

అయితే బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల వేసవిలో మాత్రమే ఇబ్బందిగా ఉంటుందని, మిగిలిన సీజన్స్ లో బట్టలు లేకుండా నిద్రపోవడం మంచిదేనని అంటున్నారు. బట్టలు లేకుండా కానీ కొద్దిగా దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడుతుంది. అంతేకాకుండా చర్మం కూడా అందంగా ఉంటుంది. రాత్రి పూట తక్కువ దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.  

Leave a Comment