భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర…

LPG GAS ధరలు భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మర్కెట్ లో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరలు మూడో నెలలోనూ తగ్గాయి.

గత ఏడాది జనవరిలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.150.50 తగ్గింది. ఇప్పుడు రూ.162.50 తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ ధర రూ.581.50 వరకు తగ్గింది. గత మూడు నెలల్లో సబ్సిడీ లేని వంట గ్యాస్ ధర సిలిండర్ కు రూ.277 వరకు తగ్గినట్లు ఎల్పీజీ సంస్థలు పేరొన్నాయి. అయితే ఈ తగ్గిన ధరలు నేటి నుంచి వచ్చే 15 రోజుల వరకు అమల్లో ఉంటాయని చమురు సంస్థలు ప్రకటించాయి. 

ఏపీలో తగ్గిన ధరల వివరాలు..

 

అనంతపురంరూ.214
చిత్తూరురూ.186
కడపరూ.208
కర్నూలురూ.205.50
గుంటూరురూ.180
కృష్ణారూ.183.50
ప్రకాశంరూ.190.50
విజయవాడరూ.74
తూర్పూ గోదావరిరూ.179
పశ్చిమ గోదావరిరూ.190.50
విశాఖపట్నంరూ.192
విజయనగరంరూ.172
శ్రీకాకుళంరూ.179.50
నెల్లూరురూ.176.50

 

ఇక హైదరాబాద్ లో సబ్సియేతర సిలిండర్ ధర రూ.207 వరకు తగ్గింది. ఆదిలాబాద్ లో రూ.213, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో రూ.213.50, కామారెడ్డిలో రూ.213, యాదాద్రి భువనగిరిలో రూ.207, భద్రాద్రి కొత్తగూడెంలో రూ.190.50 వరకు ధరలు తగ్గాయి. అయితే గ్యాస్ నిల్వ కేంద్రాలు, గ్యాస్ రవానా తదితర ఛార్జీలను పరిధిలోకి తీసుకొని వంట గ్యాస్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని అధికారులు తెలిపారు. 

Leave a Comment