How to Update ‘EXIT DATE’ in EPFO Records
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(EPF) ను 1952 నాటి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో మీరు ప్రతి నెలా ఉద్యోగి వేతనంలో 12 శాతం EPF అకౌంట్ కు వెళ్లిపోతుంది. సంస్థ కూడా 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ కు కంట్రిబ్యూట్ చేస్తుంది.
ఇక నుంచి ఉద్యోగులకే అధికారం…
అయితే ఈపీఎఫ్ ఇప్పుడు ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు జాబ్ ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసే అధికారం కేవలం కంపెనీలకు మాత్రమే ఉండేది. కానీ ఎక నుంచి ఉద్యోగులే ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసుకునేలా ఈపీఎఫ్ అవకాశం కల్పించింది. అయితే జాబ్ మానేసిన రెండు నెలల తర్వాత మాత్రమే ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఫీఎఫ్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఆ సదుపాయం అందుబాటులో ఉంటుంది. గతంలో ఉద్యోగి ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసే అధికారం కేవలం కంపెనీలకు మాత్రమే ఉండేది. దీంతో కంపెనీలు ఉద్యోగులకు ఇబ్బందులు పెట్టేవి. నోటిస్ పీరియడ్ లేకుండా జాబ్ మానేసిన వారికి కంపెనీలు ఎగ్జిట్ డేట్ ఇవ్వకుండా సతాయించేవి. అయితే ఇప్పుడు ఉద్యోగులకు ఈ బాధలు ఉండవు. వారే ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.
ఎగ్జిట్ డేట్ లేకపోతే…
ఈపీఎఫ్ వో రికార్డ్స్ లో ఎగ్జిట్ డేట్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బు విత్ డా్ర చేసుకోవడం కుదరదు. అలాగే అకౌంట్ ను కొత్త కంపెనీకి ట్రాన్స్ ఫర్ కూడా చేయడం కుదరదు.
HOW TO UPDATE EXIT DATE
పీఎఫ్ అకౌంట్ ఉన్న వారు ఆన్ లైన్ ద్వరా ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. దీని కోసం సభ్యుడు ఈసేవా పోర్టల్ కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈపీఎఫ్ కొత్ సదుపాయం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం పీఎఫ్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఎగ్జిట్ డేట్ అప్ డేట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కచ్చితంగా దగ్గరనే ఉండాలి.
ఎగ్జిట్ డేట్ అప్ డేట్ చేసే విధానం..
- ముందుగా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ కు వెళ్లాలి. అక్కడ మీ UAN , పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు మేనేజ్ అనే ట్యాబ్ లోకి వెళ్లాలి. అక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జిట్ డేట్ అప్ డేట్ చేయాల్సిన కంపెనీ,
ఈపీఎఫ్ అకౌంట్ ఎంచుకోవాలి. పాత కంపెనీ మీ పీఎఫ్ అకౌంట్ కు చేసిన చివరి కంట్రిబ్యూషన్ కు 2 నెలల తర్వాతనే ఎగ్జిట్ డేట్ ను అప్ డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. - తర్వాత ఎగ్జిట్ డేట్ ను ఎంటర్ చేయాలి. ఎగ్జిట్ కు కారణం తెలియజేయాలి.
- ఇప్పుడు రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు అప్ డేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తర్వాత ఓకే చేయాలి.
కంపెనీ ఎగ్జిట్ డేట్ అప్ డేట్ చేసిందా ? లేదా ? చెక్ చేసుకోండి..
మీరు ఈసేవా పోర్టల్ కు లాగిన్ అయిన తరువాత ఈపీఎఫ్ వో రికార్డులలో నుంచి మీ పాత కంపెనీ ఎగ్జిట్ చేసిందా ? లేదా? అనేది చెక్ చేసుకోందడి. దీని కోసం ఈ కింది దశలను అనుసరించండి.
- ఈపీఎఫ్ వో వెబ్ సైట్ లోకి లాగిన్ అయితన తరవాత ‘View’ tab మీద క్లిక్ చేసి Service History ని సెలెక్ట్ చేయండి.
- ఇక్కడ మీ ఎగ్జిట్ డేట్ వివరాలను చూసుకోవచ్చు.