మీ VOTER ID ని సులభంగా ఇలా అప్డేట్ చేసుకోండి..

ఓటర్ ఐడి కార్డు అనేది భారత ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు. ఇది 18 ఏళ్లు నిండిన భారత పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం జారీ చేస్తుంది.
ఈ ఫొటో గుర్తింపు కార్డులో మన ఫొటో, ఇంటి అడ్రస్, పేర్లు తదితర వివరాలు ఇతర గుర్తింపు కార్డులు ఆధార్, పాన్ లలో ఉన్నట్టు ఉన్నాయా లేదా ఒక సారి చెక్ చేసుకోండి.

ఒకవేళ్ల వాటి ఉన్న వివరాలు ఓటర్ కార్డులో ఉన్న వివరాలతో సరిపోల్చకపోతే వాటిని సరి చేసుకోండి. కింద ఇచ్చిన సూచలన ప్రకారం చాలా సులభంగా  మార్చుకోవచ్చు.

ఓటర్ కార్డులో వివరాలు సరిచేసుకునే విధానం..

  • ముందుగా మీరు https://www.nvsp.in/  సైట్ లో లాగిన్ అవ్వాలి.  ఒక వేళ మీకు అకౌంట్ లేనట్లయితే మీ మొబైల్ నెంబర్ తో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. 
  • తరువాత ‘Correction of entries in the electoral roll’ పై క్లిక్ చేయండి.
  • మునుపటి పాయింట్‌లో పేర్కొన్న ఆప్షన్‌పై క్లిక్ చేసిన తరువాత, Form-8 పై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత మీకు వివరాలు కరెక్షన్ చేయాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కరెక్షన్ చేయాల్సిన వివరాలను ఎంచుకోండి. 
  • తరువాత మీ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పట్టణం తదితర వివరాలు నమోదు చేయండి.
  • మీ EPIC ( ఓటరు కార్డు నెంబర్) నెంబర్ కూడా సూచించన దగ్గర ఎంటర్ చేయండి. తరువాత ఫొటో గ్రాఫ్ అప్షన్ ఎంచుకోండి. 
  • ఇక్కడ (e) కాలంలో మీరు సరిచేసుకోవాల్సిన వివరాలకు సంబంధిచిన బాక్స్ దగ్గర టిక్ చేయాలి(ఒక్క సారి మూడు బాక్సులు మాత్రమే టిక్ చేయవచ్చు).
  • మీరు టిక్ చేసిన బాక్సుల ప్రకారం మీ పేరు, అడ్రస్, వయస్సు, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయండి. 
  • చివరి బాక్స్ లలో మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తరువాత మీ వివరాలు సరి చూసుకొని ‘Submit’ చేయండి. 

Leave a Comment