రైస్ కార్డు ekyc స్టేటస్ ఇలా తెలుసుకోండి..

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న బియ్యం కార్డులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కార్డులు వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కార్డులు రాలేదు. ఎందుకంటే ఈ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రొసేస్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతంది. కొన్ని ప్రాంతాల్లో ekyc అయిందా ? లేదా అనేది చెక్ చేస్తున్నారు. మనకు ఈ బియ్యం కార్డుల యొక్క ఎలిజిబుల్ లిస్టు వచ్చిన తరువాత వీరందరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ అయిత తరువాత వారి కుంటుంబ సభ్యులకు ekyc అయిందా ? లేదా అని చెక్ చేస్తున్నారు. Ekyc అయితేనే మీకు బియ్యం కార్డు రావడం జరుగుతుంది. Ekyc ని ఆన్ లైన్ లో రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. 

  • ఇందులో మొదటిది మీ గ్రామ/వార్డు వలంటీర్ ని కలిసి మీ ekyc అయిదా ? లేదా అనేది తెలుసుకోవచ్చు. 
  • లేదా మీరే స్వయంగా ఆన్ లైన్ మీ ekycని చెక్ చేసుకోవచ్చు. 

ఆన్ లైన్ లో ekycని చెక్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా మీరు https://epdsap.ap.gov.in/epdsAP/epds సైట్ లోకి వెళ్లాలి. 
  • ఆ తరువాత పైన మీకు ‘Status Check’ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళితే మీ ‘Pulse surve search’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. 
  • ఆ తరువాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 
  • మీరు ప్రజాసాధికార సర్వేలో నమోదు కాకపోతే Please enroleled the prajasadhikara survey వస్తుంది. 
  • మీరు ప్రజాసాధికార సర్వేలో నమోదు అయి ఉంటే మీ కుటుంబ సభ్యల వివరాలు అనేది రావడం జరుగుతుంది. కుటుంబంలో ఎంత మందికి ekyc అయింది? ఎంత మందికి కాలేదు అనే వివరాలు, రేషన్ కార్డు నెంబర్ తదితర వివారలు అక్కడ రావడం జరుగుంది.
  • Ekyc స్టేటన్ no అని వస్తే వారు తప్పనిసరిగా మీ గ్రామ వలంటీర్ వద్ద ekyc నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. 

CLICK HERE :  https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx

Leave a Comment