రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా.. హోండా హైనస్ సీబీ 350 బైక్..

రాయల్ ఎన్ ఫీల్డ్ కు పోటీగా హోండా కొత్త బైక్ ను విడుదల చేసింది. హోండా ‘హైనస్ సీబీ 350’ పేరుతో మార్కెట్ లోకి ఎంటరైంది. ఈ బైక్ 350 సీసీ ఇంజిన్ తో స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టం కలిగి ఉంటుంది. దీని ధర ఎక్స్ షోరూంలో రూ.1.9 లక్షలుగా ఉంటుందని హోండా కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రత్యేకంగా ఇండియన్ కస్టమర్ల కోసమే హోండా హైనస్ ను కంపెనీ రూపొందించింది. ఇండియాలో అమ్మిన తర్వాతనే ఇతర మార్కెట్లో ఈ బైక్ అమ్మకాలు నిర్వహించనున్నారు.

 ఈ బైక్ పండుగ సీజన్ నవరాత్రి నుంచి అమ్మకానికి వస్తుందని కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ గులేరియా వెల్లడించారు. డీలక్స్, డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో హైనస్ సీబీ 350 అందుబాటులో ఉంటుంది. టోకెన్ అమౌంట్ రూ.5 వేలు కట్టి ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది చివరి నాటికి 50 బిగ్ వింగ్ షోరూంలను తెరవాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రత్యేకతలు..

  • హోండా హైనస్ బైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందింది. 
  • బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది.
  • రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టాల్ హ్యాండిల్ బార్స్, స్ల్పిట్ సీట్, అలాయ్ వీల్స్, క్రోమ్ మిర్రర్స్ ఉన్నాయి. 
  • హోండా డీలక్స్ ప్రో వేరియంట్ లో ఉండే స్మార్ట్ ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ తో రైడర్స్ తమ స్మార్ట్ ఫోన్ ను బ్లూటూత్ తో బైక్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. 

Leave a Comment