సోనూసూద్ బాటలో ప్రకాష్ రాజ్.. విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోనుసూద్ దారిలో పయనిస్తున్నాడు.  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థినికి సాయం చేసి  మంచి మనుసు చాటుకున్నాడు. విదేశాల్లో పై చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థినికి అండగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవంకు చెందిన శ్రీచందన తండ్రి 9 ఏళ్ల క్రితం మరణించాడు. శ్రీచందన కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ సీటు సంపాదించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాస్టర్స్ చేయలేకపోతోంది. 

ఇది తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెకు అండగా నిలిచారు. ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చారు. యూకేలో నివసించేందుకు అవసరమైన డబ్బుతో పాటు ట్యూషన్ ఫీజును కూడా అందించారు. తండ్రి లేకపోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్నట్లు శ్రీచందన సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇది చూసిన ప్రకాష్ రాజ్ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 

Leave a Comment