ఇంటికే అన్ని సేవలూ..కేరళ ప్రభుత్వం కొత్త పథకం..

ప్రపంచ దేశాలను వణికుస్తున్న కరోనా ఇప్పుడు మన దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరు దగ్గినా..తుమ్మినా.. అది కరోనా వైరసేనా అన్నట్లుగా ప్రజలు భయపడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తుంది. దేశంలో మొదటగా కరోనా వచ్చిన కేరళలోనూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా ప్రజలకు ఆహారంతో పాటు..కొన్ని సేవలను హోం డెలివరి చేసేందుకు సిద్ధమవుతుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవసర జాగ్రత్తలు తీసుకుంటుంది. 

కేరళ ఇప్పటికే 17 కరోనా పాజిటీవ్ కేసులతో సతమతమవుతుంది. కరోనా  వ్యాప్తిని నియంత్రించేందుకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలను స్థానిక పంచాయతీ పర్యవేక్షణలో ఇంటింటికీ డెలివరీ చేయిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలను రద్దు చేసింది. అంతే కాకుండా అత్యవసరంగా బయటకు వెళ్లే వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా..కరోనా భయం ఉన్నా..ఇప్పటికీ ప్రజలు, ఆహారం, నీరు, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో వాళ్లు ఇబ్బంది పడకుండా.. కేరళ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. 

అదేవిధంగా సేవల్లో నాణ్యత పెంచేందుకు 24 గంటల కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బ్రాడ్ బ్యాండ్ లో క్వాలీటీ ఉండేలా చూస్తున్నారు. అతాగే కేరళ సీఎం పినరయి విజయన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే ట్వట్టర్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా వర్క్ ఫ్రం హోం ద్వారా పని చేసే వారికి బెస్ట్ ఇంటర్నెట్ సేలను అందిస్తున్నారు. 

Leave a Comment