ఆ ఎస్సై బదిలీపై వెళ్తే.. ప్రజలంతా ఏడ్చారు.. ఎందుకంటే..!

సాధారణంగా ఒక ఎస్సై బదిలీపై వెళ్తే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సిబ్బంది మాత్రం ఆయన సన్మానం చేసి పంపిస్తారు.. అయితే గుజరాత్ లో ఓ ఎస్సై బదిలీపై వెళ్తే ప్రజలంతా కన్నీరుపెట్టుకున్నారు. ఎంతో భావోద్వేగంతో ఆయనకు వీడ్కోలు పలికారు. ఆ గ్రామంలోని ప్రజలంతా స్టేషన్ ముందు చేరి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనపై పూలు చల్లి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

గుజరాత్ లోని ఖేద్ బ్రహ్మ పట్టణంలోని పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విశాల్ భాయ్ పటేల్ ప్రజలతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పట్టణంలో శాంతి భద్రతలు పర్యవేక్షించడంతో పాటు కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. అందరి ఇళ్లకు వస్తువులు పంపించి ఆరోగ్యం బాగా లేని వారి కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అంబులెన్స్ లు ఏర్పాటు చేసి ఎంతో సేవలు చేశారు. 

విశాల్ భాయ్ పటేల్ ఖేద్ బ్రహ్మ పోలీస్ స్టేషన్ లో దాదాపు రెండేళ్ల పాటు పనిచేసి బదిలీ అయ్యారు. అయితే ఆయన బదిలీ అయిన విషయం తెలిసి స్థానిక ప్రజలతో పాటు పోలీస్ స్టేషన్ లోని ఇతర సిబ్బంది ఆయనకు వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఆయన వెళ్తుంటే పూల వర్షం కురిపిస్తూ.. ఆలింగనం చేసుకుంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజల అభిమానం చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment