వింత దొంగతనం.. అమ్మాయిల లోదుస్తులు దొంగలించారు.. వీడియో వైరల్..!

ఎక్కడైన దొంగతనం అంటే ఖరీదైన వస్తువులు, బంగారం, డబ్బులు దోచేస్తారు. అయితే ఇక్కడ వింత దొంగతనం జరిగింది. అమ్మాయిల లోదుస్తులను దొంగలించారు. లోదస్తులు పోయాయంటూ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదైంది. ఈ వింత కేసు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, అది వైరల్ అయింది. 

వీడియోలో స్కూటీపై ఇద్దరు యువకులు వచ్చి ఓ చోట ఆగుతారు. అటు ఇటు చూసి అమ్మాయిల లోదస్తులు దొంగలించి స్కూటీలో పెట్టుకుని పారిపోతున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తమ కూతురు లోదస్తులు దొంలించి ఏమైన తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారేమోనని అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు. మరొకరి కొసం గాలిస్తున్నారు. 

Leave a Comment