యాంకర్ శ్రీముఖికి అభిమాని 4 పేజీల లేఖ.. ఫుల్ ఖుషీలో బ్యూటీ..!

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్ పై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో ఈమె బోలెడు మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ అమ్మడికి ఓ అభిమాని 4 పేజీల లేఖ రాశాడు..

టెక్నాలజీ ఈ పెరుగుతున్న కూడా ఒక లెటర్ పోస్టులో రావడం, తన కెరీర్ లో జరిగిన అన్ని విషయాలు నాలుగు పేజీల్లో రాయడం, అది కూడా అచ్చ తెలుగులో లేఖ రాయడంపై శ్రీముఖి సంతోషం వ్యక్తం చేస్తోంది. చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉందని, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. ఆమెకు ఈ లెటర్ రాసిన పేరు వెంకట్ అని తెలిపారు. అంతకు మించి లెటర్ రాసిన వ్యక్తి గురించి వివరాలు చెప్పలేదు. తనకు వచ్చిన ఈ లెటర్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసింది. 

శ్రీముఖికి వచ్చిన లెటర్ లో ఆమె అందాన్ని, యాంకరింగ్ టాలెంట్ ని ఆకాశానికెత్తారు. అందంలో, అభినయంలో మీకు సాటిలేరని వివరించారు. సుదీర్ఘమైన ఈ లేఖలో శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన మలుపులను, ఘట్టాలను ప్రస్తావించాడు. గ్లామర్ ఫీల్డ్ లో శ్రీముఖి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని లేఖ ముగించాడు. 

స్మాల్ స్క్రీన్ పై ఎన్నో షోల్లో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’, మాస్ట్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.  ఇక తన గ్లామర్ తో అందరిని ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. 

 

Leave a Comment