ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

తాడేపల్లి : రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొన్ని జిల్లాల్లో పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆరా తీశారు. బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని ఆదేశాలిచ్చారు.  రెండు వారాలకు ఒకసారి బిల్లులు చెల్లించడం ద్వారా పనులు చేసే వారికి ప్రోత్సాహం కల్పించాలన్నారు. ఆరు వారాల్లో ప్రారంభించిన ఉపాధి హామీ పనులను పూర్తి చేయాలలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టినప పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. 

ఇళ్ల స్థలాల చదును పనులు పూర్తి చేయాలి..

ఉగాది నాటికి ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తోందని, ఇళ్ల స్థలాల చదును పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మార్చి 1వ తేదీ నాటికి ఇళ్ల స్థలాల చదును పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మెటీరియల్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 45 రోజుల్లో పనులను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.  ఇప్పటి వరకు 9,360 గ్రామ సచివాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నారు. వాటిల్లో 8,159 పనులు ప్రారంభమయ్యాయన్నారు. 

దీనితో పాటు 17,376 సిసి డ్రైన్ పనులకు అనుమతి ఇవ్వగా..దానిలో 15,375 పనులను ప్రాంభించారన్నారు.  మొత్తం 10,394 ఇళ్ల స్థలాల చదును పనులకు గానూ 10,394 పనులు ప్రారంభించారని తెలిపారు. మొత్తం 10,227 పనులకు గానూ నాడు-నేడు లో భాగంగా 6,596 పనులు ప్రారంభించారన్నారు. మొత్తం 1,21,582 సిసి రోడ్ల పనులకు గానూ 82,513 పనులు ప్రారంభించారని పేర్కొన్నారు.  ఇంకా ప్రారంభం కాని వాటిని వెంటనే మొదలు పెట్టాలన్నారు. 

ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు నివేదికలను పంచాయతీరాజ్‌ శాఖకు తెలియజేయాలన్నారు.

Leave a Comment