డాక్టర్ రెడ్డిస్ కరోనా డ్రగ్ లాంచ్..!

ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ భారత్ తో కరోనా వైరస్ డ్రగ్ ను విడుదల చేసింది. అవిగాన్(ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను లాంచ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని వేగంగా అందించడానికి 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ కూడా చేస్తన్నట్లు ప్రకటించింది. జపనీస్ దిగ్గజం ఫుజిఫిల్మ్ టొయామా కెమికల్ కంపెనీతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా ఈ టాబ్లెట్లను తీసుకొచ్చినట్లు కంపెనీ బ్రాండెడ్ మార్కట్స్ సీఈవో రమణ తెలిపారు. 

ప్రస్తుతం ఈ డ్రగ్ ను జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో భారతదేశంలోనూ తయారు చేస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ కు సంబంధించి మరో ఔషధం రెమ్ డెసివిర్ ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ను కూడా ఆయన ప్రారంభించారు. 

 

Leave a Comment