ఇది మీకు భావ్యమేనా : ఆళ్ల నాని

రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు సీఎం జగన్ అత్యంత పకడ్బంధీగా చర్యలు చేపడుతున్న తరుణంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించడం హేయమైన చర్య అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. బీజేపీని ఫణంగా పెట్టి కన్నా ఈ విధంగా మాట్లాడటం భావ్యమేనా అని ప్రశ్నించారు. 

టీడీపీతో కుమ్మక్కై కన్నా సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని అన్నారు. రాపిడ్ టెస్ట్ కిట్లను తాము  icmr సంస్థ ద్వారా రూ.730లకు కొనుగోలు చేశామని, రూ.795లతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసిందని చెప్పారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించాలన్నారు. 

రాష్ట్రాన్ని ప్రతి విషయంలో ప్రశ్నిస్తు మొదటి నుంచి అడ్డంకి సృష్టించి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రమైన ఇటువంటి కార్యక్రమాలలో అడుగులు వేస్తున్న దాఖలు లేని సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అడుగులు వేస్తున్నా.. వాటిని అపహాస్యం చేసేలా  మాట్లాడుతున్నారని తెలిపారు. లాక్ డౌన్ లో ఏ విధముగా పాల్గొంటున్నారో..అదే విధంగా చంద్రబాబు అండ్ కో చేసే కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాలని కోరుతున్నామన్నారు. 

 

Leave a Comment