యువతలో పెరిగిన హార్ట్ స్ట్రోక్స్.. లైఫ్ స్టయిల్ మార్చుకోకపోతే అంతే..!

ఎప్పుడో వయస్సు పైడిన తర్వాత రావాల్సిన జబ్బులు.. యుక్తవయస్సులోనే వస్తున్నాయి. మారుతున్న జీవినశైలి విధానమే ఇందుకు కారణం.. 30 ఏళ్లలోనే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండెజబ్బులు వంటివి యువతలో ఎక్కువగా నమోదవుతున్నాయి..

ముఖ్యంగా ఎక్కువ మంది యువతలో మానసిక జబ్బులు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు, చదువుల్లో ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతున్నారు. అయితే జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారి కార్యక్రమాలను బట్టి ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా 35 ఏళ్లలోపు యువకులకు వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల హార్ట్ స్ట్రోక్స్ పెరిగాయని, వ్యాయామం లేక డయాబెటీస్ కూడా పెరిగిందని వెల్లడైంది. 

లైఫ్ స్టయిల్ మార్చుకోకపోతే నష్టమే..

ముఖ్యంగా ఆహారంలో తీవ్రమైన మార్పులు జరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఒత్తిడి గుండె జబ్బులకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే కోరికలు పెద్దవిగా ఉండడం.. దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో చాలా మంది యువకులు మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. వీటిని తగ్గించాలంటే ముఖ్యంగా యువతలో మార్పు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక వ్యాయామం, కూరగాయలతో కూడిన మంచి ఆహారం ద్వారా గుండెపోటును నివారించుకోవచ్చని అంటున్నారు. 90 శాతం మంది యువత వ్యాయామం లేక సమతమతమవుతున్నారని, లైఫ్ స్టయిల్ మార్పుకోకపోతే నష్టం కొనితెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

 

Leave a Comment