RRR Trailer: ‘ఈ నక్కల వేట ఎంత సేపు’..ఓ రేంజ్ లో యాక్షన్ సీన్స్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ వచ్చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 

ఇక విజువల్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒళ్లు గగుర్పొడిచే సీక్వెన్స్ లు, రోమాలు నిక్కబిడిచే సన్నివేశాలు, డైలాగులతో ట్రైలర్ అదరహో అనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల ఆధారంగా ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజమౌళి.. ఒక వైపు రామ్, మరో వైపు భీమ్ తమ పర్ఫార్మెన్స్ తో కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారు. 

ఇక ప్రతి డైలాగ్ సుపర్బ్ అనిపిస్తోంది..ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా.. గర్వంతో గీ మన్నులో కలిసిపోతాను అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్.. ‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడుదాం రా’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అదరిపోయాయి. ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ పులిని వేటాడడం.. ఆ తర్వాత గర్జించే సీన్ అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

 

Leave a Comment