కరోనా కేసుల్లో ఢిల్లీ మర్కజ్ కేసులు ఎన్నో తెలుసా..

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పలు వివరాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన 14,378 కేసుల్లో ఢిల్లీ మర్కజ్ కు సంబంధించి 4,291 కరోనా కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. శనివారం ఆయన హెల్త బులిటెన్ విడుదల చేశారు. ఈ కేసుల్లో అత్యధికంగా తమిళనాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం, తెలంగాణలో 79 శాతం, యూపీలో 59 శాతం, ఏపీలో 50 శాతం కేసులు మర్కజ్ కు లింక్ ఉన్నవే అని తెలిపారు. 

ఇప్పటి వరకు 14, 378 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 480 మంది మరణించారని తెలిపారు. 1992 మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. దేశంలో 73 శాతం కరోనా మరణాలు 60 ఏళ్లు పైబడిన వారివే అని వెల్లడించారు. దేశంలో రెండు వారాలుగా 22 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కారణంగా సంభవించిన మరణాల రేటు కేవలం 3.3 శాతమని పేర్కొన్నారు.

ఇక వయస్సుల వారిగా మరణాల రేటును ఆయన వెల్లడించారు. 

  • 0-45 ఏళ్ల మధ్య ఉన్న వారు 14.4 శాతం
  • 45-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 10.3 శాతం
  • 60-75 ఏళ్ల మధ్య ఉన్న వారు 33.1 శాతం
  • 75 ఏళ్లకు పైబడిన వారు 42.2 శాతం

 

Leave a Comment