తండ్రికి సెల్యూట్ చేస్తున్న కూతురు.. తండ్రి గర్వపడే క్షణాలు..!

ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లలు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడు గర్వంగా ఉంటుంది. అదే తండ్రి తన కూతురు చేత సెల్యూట్ అందుకున్నప్పుడు ఆ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె.. అదే రంగంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణంలో ఆమె తండ్రి పొందని ఆనందం మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం తండ్రి, కుమార్తె ఇద్దరు ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్ పోలీస్ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఆ పరేడ్ ఆపేక్షా తండ్రి ఐటీబీపీ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నింబాడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ లో భాగంగా ఆపేక్షా తన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆయన తిరిగి సెల్యూట్ చేశారు. ఇలా ఒకరికొకరు తండ్రి, కూతురు ఇద్దరు సెల్యూట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురితో సెల్యూట్ అందుకున్న తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆపేక్షా నింబాడియా సిలివ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మొరాదాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ అయింది. ఆమె ఉత్తరప్రదేశ్ లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.     

 

View this post on Instagram

 

A post shared by ITBP (@itbp_official)

Leave a Comment