అత్త బర్త్ డే రోజు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన కోడలు..!

అత్తా కోడళ్లు అంటేనే కలహాలు, విబేధాలు గుర్తకొస్తాయి. ఇక టీవీ సీరియల్స్ లో అయితే అత్తాకోడళ్లు అంటే బద్ధశత్రువులుగా చూపిస్తారు. కానీ అత్తను కూడా తల్లిగా భావించే కోడళ్లు చాలా మంది ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కోడలు తన అత్తపై చూపిన ప్రేమకు అందరరూ ఫిదా అవుతున్నారు. అత్త పుట్టిన రోజు నాడు ఎవరూ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కోడలు తన అత్తగారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 60 రకలా వంటకాలను తయారు చేసింది. అన్ని రకాల వెరైటీలు మెనూలో చేర్చింది. వంటకాలను డబ్బాల్లో నింపి వాటిపై ఆ వంటకం పేరు రాసి పెట్టింది. వీటిలో పులిహోర నుంచి మ్యాగీ నూడిల్స్ వరకు అన్ని రకాల వంటలు ఉన్నాయి. వీటన్నింటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. అత్తపై కోడిలి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

Leave a Comment