దేవుడి మీద కోపంతో.. విగ్రహాలను ధ్వంసం చేశాడు..!

దేవుడి మీద కోపంతో ఓ వ్యక్తి.. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశాడు.. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఛట్టార్ పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్(27) రోజువారీ కూలి.. పనిచేస్తే కానీ రోజు గడవదు. వినోద్ కి భార్య, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడు నాలుగేళ్లుగా వారిద్దరి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు…

ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వారి ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇటీవల అతడికి పిల్లనిచ్చిన అత్తకూడా చనిపోయింది. ఈ పరిణామాలతో వినోద్ మానసికంగా కుంగిపోయాడు.. దేవుడి మీద కోపం పెంచుకున్నాడు. సోమవారం పూజారి లేని సమయంలో ఆలయంలో మూడు విగ్రహాలను ధ్వంసం చేశాడు..

ఈ ఘటనపై బేటా 2 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్థానికంగా ఉన్న ఆలయంలో మూడు దేవుని విగ్రహాలను ధ్వంసం చేశాడని అతడిపై అభియోగం నమదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడం(ఐపీసీ సెక్షన్ 295) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. 

Leave a Comment