ఫోన్ పే యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక రూ.100తో కూడా గోల్డ్ కొనొచ్చు..!

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్-పే గుడ్ న్యూస్ అందించింది. ఫోన్ పే తన యూజర్స్ కి కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్)ని ప్రారభంచింది. దీని ద్వారా ప్రతినెల ఒక నిర్ధిష్ట మొత్తంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీని కోసం ఫోన్ పే ఎంఎంటీసీ పీఏపీఎం, సేఫ్ గోల్డ్ అనే సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సిప్ పెట్టుబడుల ద్వారా సేకరించిన బంగారాన్ని ఈ సంస్థలు నిర్వహిస్తున్న బ్యాంక్ – గ్రేడ్ లాకర్లలో భద్రపరుస్తారు.. 

ఫోన్ పే గోల్డ్ సిప్ యూజర్స్ చిన్న, సాధారణ నెలవారీ పెట్టుబడుల ద్వారా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని ఫోన్ పే తెలిపింది. దీని ద్వారా దీర్ఘకాలిక బంగారు పెట్టుబడులను కలిగి ఉండొచ్చని వివరించింది. కస్టమర్లు నెలకు రూ.100 నుంచి సిప్ ప్రారంభించవచ్చు. 

గోల్డ్ సిప్ ని ఎలా ప్రారంభించాలి?

  • ఫోన్ పే యాప్ లో గోల్డ్ సిప్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. 
  • అక్కడ గోల్డ్ ప్రొవైడర్ ని ఎంచుకోవాలి. ఎంఎంటీసీ, సేఫ్ గోల్డ్ లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత నెలకు ఎంత పెట్టుబడి పెడతారో ఎంటర్ చేయాలి. యూజర్స్ ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 
  • తర్వాత మీ ఎంచుకున్న మొత్తానికి ప్రస్తుతం ఎంత బంగారం వస్తుందనేది చూపిస్తుంది. దాని కింద గ్రామ్ బంగారం ధర ఎంత ఉందో చూపిస్తుంది. 
  • ఆ తర్వాత మీరు ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారో ఎంచుకుని ‘ప్రొసీడ్’ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత సిప్ తేదీని ఎంపిక చేసుకుని, సిప్ అమౌంట్, తేదీ తదితర వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఒకసారి వివరాలు చెక్ చేసుకొని పేమెంట్ చేయాలి.
  • ప్రతినెలా సిప్ తేదీకి ఆటోమెటిక్ గా డబ్బులు కట్ అయ్యేలా ఆటో-సెటప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.  

  

 

 

Leave a Comment