బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్..

సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని AP CPDCL అధికారులు చెబుతున్నారు. బిల్లులు చెల్లించడంపై వినియోగదారులక ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నామని తెలిపారు. అయితే విద్యుత్ బిల్లు సకారంలో ఎవరూ చెల్లించడం లేదని, బిల్లలు చెల్లించకపోతే ఉపేక్షించమని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

  కరోనా వైరస్ ప్రభావం విద్యుత్ శాఖపై కూడా పడింది. కరోనా భయంతో మీటర్ రీడర్లు ఎవరూ ఇళ్ల వద్దకు రావడం లేదు. మీటర్ రీడింగ్ నమోదు చేయకపోవడంతో ఎవరు ఎంత విద్యుత్ వినియోగించింది తెలియడం లేదు. దీంతో ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు మొత్తానే మార్చి నెలకూ చెల్లించాలని డిస్కంలు నిర్ణయించాయి. అయినా చెల్లింపులు సగానికి మించి జరగడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (AP CPDCL)  పరిధిలో 49,84,708 గృహ వినియోగ కనెక్షన్లు, 4,697 హెచ్ టీ కనెక్షన్లు మొత్తం 49,89,405 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి మార్చి నెల విద్యత్ బిల్లుల డిమాండ్ రూ.466.35 కోట్లు ఉంది. కానీ ఇప్పటి వరకు రూ.258.10 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

ఇందులో గృహ వినియోగదారుల బకాయి రూ.250 కోట్లకు రూ.151 కోట్లు, హెచ్ టీ వినియోగదారుల బకాయి రూ.216 కోట్లకు రూ.107 కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా మార్చి నెల బకాయిలు దాదాపు రూ.208 కోట్లు రావాలసి ఉంది. అంటే ఇప్పటి దాకా 55 శాతం చెల్లింపులు మాత్రమే జరిగాయి. 

వీటిలో 35 శాతం వరకు ఆన్ లైన్ లేదా డిజిటల్ చెల్లింపులు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా మీ సేవా కేంద్రాలు మూతపడ్డాయి. కానీ ఈఆర్వోలు తెరిచే ఉన్నాయి. అయినప్పటికీ విద్యుత్ బిల్లుల చెల్లింపులు నామమాత్రంగానే జరుగుతున్నాయి. 

 

Leave a Comment